కనకదుర్గమ్మకు బంగారు కాసులపేరు సమర్పణ

ABN , First Publish Date - 2020-12-01T06:24:52+05:30 IST

కనకదుర్గమ్మకు బంగారు కాసులపేరు సమర్పణ

కనకదుర్గమ్మకు బంగారు కాసులపేరు సమర్పణ

విజయవాడ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : అమెరికాలోని సియాటెల్‌కు చెందిన హేమంత్‌, శ్రుతి దంపతులు 81 గ్రాముల బంగారంతో చేయించిన లక్ష్మీ కాసులపేరును సోమవారం కనకదుర్గమ్మకు సమర్పించారు. దాతల తరఫున విజయవాడలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఈ కాసులపేరును దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబుకు అందజేశారు. కాగా, యనమలకుదురుకు చెందిన కడారు వెంకటరమణమూర్తి, నాగమహాలక్ష్మి నిత్యాన్నదానానికి రూ.లక్ష అందజేశారు. 

Updated Date - 2020-12-01T06:24:52+05:30 IST