నేటినుంచి బాణసంచా దుకాణాలకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-10-28T10:36:09+05:30 IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దుకాణాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి నవంబరు 8వ తేదీ వరకు సంబంధిత రెవెన్యూ డివిజన్‌, సబ్‌ కలెక్టర్‌

నేటినుంచి బాణసంచా దుకాణాలకు దరఖాస్తులు

 జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌


గుంటూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దుకాణాలు నిర్వహించుకునేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి నవంబరు 8వ తేదీ వరకు సంబంధిత రెవెన్యూ డివిజన్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో  దరఖాస్తులు చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌సూచించారు. దరఖాస్తులను పరిశీలించి నవంబరు 11వ తేదీన ఆర్‌డీవోలు, సబ్‌ కలెక్టర్లు అనుమతులు మంజూరు చేస్తారని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో దీపావళి పండగని పురస్కరించుకొని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశం నిర్వహించారు. నివాస ప్రాంతాలకు 50 మీటర్ల దూరంలో విశాలమైన ఖాళీ ప్రదేశాలలోనే బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.  సమావేశంలో తెనాలి సబ్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, నరసరావుపేట సబ్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్‌, గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, గురజాల ఆర్‌డీవో పార్థసారధి, అర్బన్‌ ఏఎస్‌పీ మనోహర్‌, అగ్నిమాపక శాఖ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, బాణాసంచా హోల్‌సేల్‌ రిటైల్‌ వ్యాపారస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-28T10:36:09+05:30 IST