తెలుగు ప్రజల గుండెల్లో ‘ఘంటసాల’ చిరస్మరణీయుడు
ABN , First Publish Date - 2020-12-05T05:57:11+05:30 IST
మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
విజయవాడ కల్చరల్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మహా గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఘంటసాల జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి ఘంటసాల గేయాలు నేటి కళాకారులకు ఒక ఉపాధిని చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆయన చివరిగా పాడిన భగవద్గీత శాశ్వతంగా నిలిచిపోయిందన్నారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ వంగపండు ఉష, సాంస్కృతిక శాఖ సీఈవో మల్లికార్జునరావు, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘంటసాల భారీ చిత్రపటాన్ని కలెక్టర్‌కు మల్లికార్జునరావు అందజేశారు. అనంతరం వర్థమాన గాయకులు ఘంటసాల గీతాలను ఆలపించారు. సాయంత్రం నిర్వహించిన సంగీత విభావరిలో అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు. కళాకారులను డైరెక్టర్ మల్లికార్జునరావు ఘనంగా సత్కరించారు.
ఘంటసాల పాట అజరామరం : మండలి
అవనిగడ్డ టౌన్ : ఘంటసాల పాట అజరామ రమని, ఆఽధునిక సంగీతానికి, లలిత సంగీతానికి పట్టాభిషేకం చేసిన గొప్ప వ్యక్తి ఘంటసాల వెంకటే శ్వరరావు అని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘంట సాల వెంకటేశ్వరరావు జయంత్యుత్సవాలు జరిగాయి. దివిసీమలో పుట్టిన గొప్ప సంగీతకారుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు అగ్రగణ్యుడని, కళాకారుడిగానే కాక స్వాతంత్య్ర సమరయోధుడిగా కూడా ఘంటసాల వెంకటేశ్వరరావు పోరాటం జరిపారన్నారు. మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలో ఘంటసాల తన బాల్యాన్ని గడిపారని, నాటక సమాజాన్ని నెలకొల్పి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రదర్శన కూడా ఇచ్చారన్నారు. పాటల పోటీల విజేతలైన కడవకొల్లు రామచంద్రరావు, తదితరులకు బుద్ధప్రసాద్ బహు మతులు అందించారు. గాంధీ క్షేత్రం కమిటీ సభ్యులు మత్తి శ్రీనివాసరావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, భోగా ది రమణ, దివిసీమ లలిత కళా సమితి సభ్యులు ఉప్పాల వీరాంజనేయులు, కొమ్మూరి శ్రీనివాస శర్మ, వేముల అంకంభొట్లు, పాలపర్తి సీతారామాంజనే యులు, కూనపరెడ్డి చంద్రశేఖర రావు, తాతా రామ కోటేశ్వరరావు, బలే వెంకటేశ్వరరావు, ఒడుగు వెంకటే శ్వరరావు, లింగం రామచంద్ర రావు, ఎస్. వేణు, ముట్నూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఎం. లోకనాథ రావు, నారగం నారాయణ రావు, నరహరశెట్టి జ్యోతి, శివ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దివిసీమకే గర్వకారణం ఘంటసాల
మోపిదేవి : ఘంటసాల వెంకటేశ్వరరావు దివిసీమలో జన్మించటం ఈ ప్రాంతానికే గర్శకారణమని, తెలుగుజాతి ఉన్నంత వరకు ఘంటసాల వెంకటేశ్వరరావు గానం అజరామరంగా నిలిచి ఉంటుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు శుక్రవారం ఆయన స్వగ్రామమైన మెరకనపల్లి పంచాయతీ శివారు టేకుపల్లిలో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బుద్ధప్రసాద్ ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల టీడీపీ అధ్యక్షుడు నడకుదుటి జనార్థనరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమసుందర్, రాజశేఖర్, యర్రంశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు.