120 కిలో గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-01T06:06:24+05:30 IST

కంచికచర్ల మండలం దొనబండ వద్ద 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

120 కిలో గంజాయి స్వాధీనం

నందిగామ రూరల్‌, నవంబరు 30: కంచికచర్ల మండలం దొనబండ వద్ద 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే సమాచారం రావటంతో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారన్నారు. రెండు కార్లలో తరలిస్తున్న 120 కిలోల గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు, మహిళను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. రెండు కార్లను సీజ్‌ చేసి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-01T06:06:24+05:30 IST