శ్రద్ధగా బస్సులు నడిపితేనే ఇంధన పొదుపు సాధ్యం

ABN , First Publish Date - 2020-02-16T09:22:50+05:30 IST

డ్రైవర్లు విధుల్లో శ్రద్ధ పెట్టి బస్సులు నడిపితే ఇంధనాన్ని చాలా సులువుగా పొదుపు చేయొచ్చని ఆర్టీసీ జిల్లా ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌ అన్నారు.

శ్రద్ధగా బస్సులు నడిపితేనే   ఇంధన పొదుపు సాధ్యం

 ఆర్టీసీ జిల్లా ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌ బస్‌స్టేషన్‌, ఫిబ్రవరి 15: డ్రైవర్లు విధుల్లో శ్రద్ధ పెట్టి బస్సులు నడిపితే ఇంధనాన్ని చాలా సులువుగా పొదుపు చేయొచ్చని ఆర్టీసీ జిల్లా ఆర్‌ఎం జి.నాగేంద్రప్రసాద్‌ అన్నారు. పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ ప్రాంగణంలోని విజయవాడ డిపో గ్యారేజీలో ఇంధన పొదుపు మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి.నాగేంద్రప్రసాద్‌ విచ్చేశారు.


విధులకు హాజరయ్యే డ్రైవర్లు గంట ముందే డిపోలో ఉన్న బస్సు వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. బస్సు కండిషన్‌ చూసుకుని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే మెకానిక్‌లు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అధిక ఇంధనం ఆదా చేసిన డ్రైవర్లు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెకానిక్‌లకు ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులను ఆర్‌ఎం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీటీఎంలు జాన్‌ సుకుమార్‌, సత్యనారాయణ, డీసీఎంఈలు సుధాకర్‌, జీవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T09:22:50+05:30 IST