తహసీల్దార్‌కు రూ.2వేల జరిమానా

ABN , First Publish Date - 2020-12-25T06:27:13+05:30 IST

కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ముసునూరు మండలం తహసీల్దార్‌ టి.మదన్‌మోహన్‌రావుకు హైకోర్టు రూ.2వేల జరిమానా విధించింది.

తహసీల్దార్‌కు రూ.2వేల జరిమానా

అమరావతి, డిసెంబరు 24 : కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ముసునూరు మండలం తహసీల్దార్‌ టి.మదన్‌మోహన్‌రావుకు హైకోర్టు రూ.2వేల జరిమానా విధించింది. ఆ సొమ్మును చెల్లించని పక్షంలో రెండు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అసైన్డ్‌ భూమి వెనక్కి తీసుకొనే క్రమంలో నిబంధనలు పాటించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఉత్తర్వులను అతిక్రమించడంతో సుమోటోగా తీసుకొని తహసీల్దార్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అతిక్రమించానని, క్షమించాలని కోరుతూ తహసీల్దార్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఆ తరువాత అఫిడవిట్‌ను వెనక్కి తీసుకుంటూ మెమో దాఖలు చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు తహసీల్దార్‌కు రూ.2వేల జరిమానా విధించింది.


Updated Date - 2020-12-25T06:27:13+05:30 IST