-
-
Home » Andhra Pradesh » Krishna » fight against ycp
-
వైసీపీ దళిత వ్యతిరేక విధానాలపై పోరు
ABN , First Publish Date - 2020-11-21T06:17:13+05:30 IST
దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోందని దళిత బహు జన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్ విమర్శించారు.

వైసీపీ దళిత వ్యతిరేక విధానాలపై పోరు
విజయవాడ సిటీ: దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోందని దళిత బహు జన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్ విమర్శించారు. ‘దళితుల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపకల్పన సన్నాహక సమావేశం’ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగింది. ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు మాట్లాడుతూ అమ రావతి కేంద్రంగానే దళిత, బహుజనుల రాజ్యాధికారం సాధ్యమవుతుం దన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దళితులకు కొత్త పథకాలు అమలు చేయకపోగా ఉన్నవాటిని రద్దు చేయడం దళిత ద్రోహమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై దళితుల నిరసనలో భాగంగా డిసెంబరు 5న విజయవాడలో రాష్ట్ర దళిత బహుజన మేధావుల సదస్సు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. దళితబహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు దుర్గారావు, పాగళ్ళ ప్రకాష్, పల్లె జ్యోతి, కె.అశ్విన్ పాల్గొన్నారు.