క్లిక్‌ ‘మై ఫాస్టాగ్‌’..! ఎలా ఉపయోగించాలంటే..

ABN , First Publish Date - 2020-12-29T16:33:05+05:30 IST

కొత్త సంవత్సరం నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రాబోతుండటంతో..

క్లిక్‌ ‘మై ఫాస్టాగ్‌’..! ఎలా ఉపయోగించాలంటే..

ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొచ్చిన ఎన్‌హెచ్‌ 

సులభంగా రూపొందించిన ఐహెచ్‌సీఎల్‌ 

ఫాస్టాగ్‌ కొనుగోలు, యాక్టివేషన్‌, రీచార్జి, వ్యాలెట్‌ ఆప్షన్స్‌ 

వాహన నెంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవచ్చు

బ్యాలెన్స్‌ వివరాలూ తెలుసుకోవచ్చు


ఆంధ్రజ్యోతి, విజయవాడ : కొత్త సంవత్సరం నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రాబోతుండటంతో వాహనదారుల సౌకర్యం కోసం కేంద్రం ‘మై ఫాస్టాగ్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్‌ను ఉపయోగించే ప్రతి వాహనదారుడు దీనిని తప్పకుండా డౌన్‌లోడ్‌ చేసుకోవటం వల్ల అనేక సదుపాయాలు మీ ఫోన్‌ నుంచే పొందవచ్చు. యాప్‌ ఈ సేవలను సులభం చేస్తోంది. 


ఎలా ఉపయోగించాలి?

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత వచ్చే ఇంటర్‌ఫేజ్‌లో ఎంటర్‌ వెహికల్‌ నెంబర్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ వాహన నెంబర్‌ను ఎంటర్‌ చేయటం ద్వారా ప్రాసెస్‌ను ప్రారంభించవచ్చు. ఇంటర్‌ ఫేజ్‌లో 4 కేటగిరిలు ఉంటాయి. 


ఇన్‌స్టంట్‌ రీ చార్జ్‌

ఇందులో ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ ఆప్షన్స్‌ ఉంటాయి. యూపీఐ ద్వారా రీఛార్జ్‌ చేసుకోవటానికి వీలుగా యూపీఐ రీఛార్జ్‌ ఆప్షన్‌ ఉంది. మీ బ్యాంకు ఖాతా నుంచి కొంత మెత్తాన్ని వాలెట్‌లోకి ఎక్కించుకోవటానికి వాలెట్‌ రీఛార్జ్‌, నేరుగా బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించటానికి ‘లాగాన్‌ టు బ్యాంక్‌ పోర్టల్‌’ ఆప్షన్స్‌ ఉంటాయి.


యాక్టివేట్‌ ఎన్‌హెచ్‌ఏఐ ఫాస్టాగ్‌ / వ్యాలెట్‌

ఈ కేటగిరి ద్వారా మీరు ఫాస్టాగ్‌ను యాక్టివేట్‌ చేసుకోవటానికి ‘యాక్టివేట్‌ ఫాస్టాగ్‌’, క్రియేట్‌ ఫాస్టాగ్‌ వ్యాలెట్‌, యాక్సెస్‌ యువర్‌ ఫాస్టాగ్‌ వాలెట్‌ ఆప్షన్స్‌ ఉంటాయి.


బై ఫాస్టాగ్‌

ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయటం కోసం ఈ కేటగిరిలో ఆప్షన్స్‌ కల్పించారు. సమీప ప్రాంతంలో ఫాస్టాగ్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పోస్‌)లు ఎక్క డున్నాయో గూగూల్‌ మ్యాప్‌ ద్వారా వెతకవచ్చు. ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయటానికి ‘బై ఆన్‌లైన్‌ ఆప్షన్‌’ ఉంది. మీరు కొనుగోలు చేసిన ఫాస్టాగ్‌ను బ్యాంక్‌కు లింక్‌ చేసుకోవటానికి ‘లింక్‌ విత్‌ బ్యాంక్‌ అక్కౌంట్‌’ ఆప్షన్‌ ఉంది.


ఇతర సేవలు

ఫాస్టాగ్‌కు సంబంధించిన ప్రశ్నలు, జవాబులకు సంబంధించి ఎఫ్‌ ఏక్యూ, ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవటానికి 1033 నెంబర్‌, టోల్‌ప్లాజాల జాబితాలు, మీ ఫీడ్‌బ్యాక్‌ ఏమిటో తెలియచేయటానికి ఫీడ్‌బ్యాక్‌ ఆప్షన్‌ కూడా ఉంది.


ఇవే కాకుండా ఫాస్టాగ్‌పై అవగాహన పెం చుకునేందుకు ప్రత్యేకంగా వీడియోలూ ఉన్నాయి. మీరిప్పటికే ఫాస్టాగ్‌ను తీసుకుంటే మీ వ్యాలెట్‌ బ్యాలెన్స్‌  తెలుసుకోవటానికి మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ ద్వారా 8884333331 నెంబర్‌కు కేవలం మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు! వెంటనే మీ బ్యాలెన్స్‌ ఎంతో చెప్పటం జరుగుతుంది.

Updated Date - 2020-12-29T16:33:05+05:30 IST