రేపటి నుంచి రైతు నిరసనలు

ABN , First Publish Date - 2020-12-11T06:23:46+05:30 IST

రేపటి నుంచి రైతు నిరసనలు

రేపటి నుంచి రైతు నిరసనలు

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వెల్లడి

విజయవాడ సిటీ : రైతుల అస్థిత్వం కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతుగా ఈనెల 12 నుంచి టోల్‌ప్లాజాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీమంత్రి, ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష కో-ఆర్డినేషన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్ల వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌-2020 బిల్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఈనెల 14న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, చట్టాల రద్దుకు కృషి చేయాలని 15 నుంచి 20వ తేదీ వరకు ఎంపీల నుంచి సంతకాల సేకరణ, రిలయన్స్‌ రిటైల్‌ కేంద్రాల వద్ద నిరసనలు జరుగుతాయన్నారు. 20వ తేదీన అన్ని మండలాల్లో ఆందోళనలు జరుగుతాయని చెప్పారు. అలాగే, ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, ప్రతి గ్రామాల్లో రైతు ఇంటి వద్ద కిసాన్‌ జ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ చట్టాలను రద్దు చేసేలా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T06:23:46+05:30 IST