ఇల్లులేని పేదవాడు ఉండకూడదన్నదే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-28T05:57:02+05:30 IST

ఇల్లులేనివారు ఉండకూడదనే లక్ష్యంతో సీఎం జగన్‌ అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి, ఉచితంగా కట్టిస్తున్నా రని మంత్రి కొడాలి నాని అన్నారు.

ఇల్లులేని పేదవాడు ఉండకూడదన్నదే లక్ష్యం
తమిరిశలో పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి కొడాలి నాని

ఇళ్ల పట్టాల పంపిణీలో మంత్రి కొడాలి నాని

నందివాడరూరల్‌(గుడివాడ), డిసెంబరు 27: ఇల్లులేనివారు ఉండకూడదనే లక్ష్యంతో సీఎం జగన్‌ అర్హులందరికీ ఇంటి స్థలం ఇచ్చి, ఉచితంగా కట్టిస్తున్నా రని మంత్రి కొడాలి నాని అన్నారు. నందివాడ మండలం తమిరిశలో ఆదివారం  311 మంది లబ్ధిదా రులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.  రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. తొలుత హైస్కూల్‌లో నిర్మించతల పెట్టిన వైఎస్సార్‌ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తమిరిశ చెరువు నీరు కలుషితమైందని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో స్వచ్ఛమైన నీటిని అందించడానికి రూ.14లక్షలతో ఫిల్టర్‌బెడ్‌లు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.  తహసీల్దార్‌ రెహమాన్‌, ఎంపీడీవో మోహన్‌ప్రసాద్‌, గుడివాడ ఏఎంసీ చైర్మన్‌ మొండ్రు సునీత, నందివాడ వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కొండపల్లి కుమార్‌రెడ్డి, వైసీపీ నాయకులు పెయ్యల ఆదాం, మొండ్రు వెంకటేశ్వర రావు, తోట నాగరాజు, తప్పిట సులేమాన్‌, కందుల నాగరాజు, బత్తుల నాగభూషణం పాల్గొన్నారు.  


నేడు మోటూరులో..

గుడివాడ రూరల్‌ : మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) మోటూరు గ్రామ సచివాలయం వద్ద సోమవారం ఇళ్లపట్టాల పంపిణీ చేస్తున్నారని మండల వైసీపీ అధ్యక్షుడు మట్టా జాన్‌ విక్టర్‌ ఆదివారం తెలిపారు. 


పామర్రు మండలంలో..

సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలతో అర్హులకు ఆనందం వ్యక్తంచేస్తున్నారని ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ అన్నారు.  పెదమద్దాలి, జమీగోల్వేపల్లి, కొమరవోలు, అడ్డాడ, ఐనంపూడి గ్రామాల్లో ఆదివారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిపేస్టోలో ఇచ్చిన హమీలన్నీంటిని సీఎం నెరవేరుస్తున్నారన్నారు. అర్హతుండి పట్టారాని వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామన్నారు.  456 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందించారు. తహసీల్దార్‌ నూతక్కి సురేష్‌బాబు, ఎంపీడీవో వై.రామకృష్ణ పాల్గొన్నారు. 


కలిదిండి మండలంలో..

 చినతాడినాడ, తాడినాడ, పోతుమర్రుల్లో కైకలూరు ఎమ్మెల్యే కుమారుడు దూలం ఆది వినయ్‌ కుమార్‌ లబ్ధిదారులకు ఇళ్లస్థలాల పట్టాలను ఆదివారం పంపిణీ చేశారు. చినతాడినాడలో 62 మందికి, తాడినాడలో 42 మందికి, పోతుమర్రులో 95 మంది లబ్ధిదారులకు అందించారు. తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యశర్మ, ఎంపీడీవో పార్థసారథి, హౌసింగ్‌ డీ ఈ ఆదినారాయణ, ఏఈ పల్లంరాజు, వైసీపీ నేతలు నంబూరి శ్రీదేవి, అయినాల బ్రహ్మజీ, అల్లూరి సూర్యనారాయణ, బొర్రా ఏసుబాబు, జంపన రాము, నీలపాల వెంకటేశ్వరరావు, నున్న కృష్ణ బాబు, చందన ఉమామహేశ్వరరావు  పాల్గొన్నారు.Updated Date - 2020-12-28T05:57:02+05:30 IST