అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై విచారణ

ABN , First Publish Date - 2020-12-19T05:42:58+05:30 IST

అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై విచారణ

అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై విచారణ
మాట్లాడుతున్న తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌

నూజివీడు రూరల్‌, డిసెంబరు 18: ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు, అమ్మకాలపై ప్రత్యేక విచారణ చేపట్టినట్లు తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చూపుతూ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించి, అమ్మకాలు చేస్తున్నట్లు కలెక్టర్‌కు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నామన్నారు. రామన్నగూడెం, ఒల్లపల్లి, అన్నవరం, ముక్కొల్లుపాడు, దిగవల్లి, జంగంగూడెం, నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ల్యాండ్‌ మాఫియా అక్రమాలకు పాల్పడినట్లు పోలీస్‌ స్టేషన్‌లోనూ పలు ఫిర్యాదులు అందాయన్నారు. వచ్చిన ఫిర్యాదులపై, ల్యాండ్‌ మాఫియా చేస్తున్న భూముల అమ్మకాలపై ప్రత్యేకంగా సీబీఐ విచారణ చేయాలని అధికారులను కోరామన్నారు. అక్రమ భూ రిజిస్ర్టేషన్లతో అమ్మకాలు, కొనుగోలు చేసినవారికీ నోటీసులు జారీ చేశామన్నారు. Read more