-
-
Home » Andhra Pradesh » Krishna » enquiry againast meo
-
ఎంఈవో వేధింపులపై విచారణ
ABN , First Publish Date - 2020-12-06T06:25:12+05:30 IST
ఎంఈవో వేధింపులపై విచారణ

ముదినేపల్లి, డిసెంబరు 5: మండల విద్యాధికారి బి.శ్రీనివాసుపై వచ్చిన వేధింపుల ఆరోపణల్లోని నిజానిజాల నిర్ధారణకు నాలుగోసారి శనివారం విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. గురజ-2 పాఠశాల హెచ్‌ఎం రజిత, పెదపాలపర్రు కాంప్లెక్స్ సీఆర్పీ విజయదుర్గ ఇచ్చిన వేధింపుల ఫిర్యాదులు, వారికి మద్దతుగా ఏపీటీఎఫ్, ఎస్టీయూ నేతలు ఇచ్చిన ఫిర్యాదులను మండల రిసోర్స్ సెంటరులో ఏపీ మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ సుల్తానాబేగం, మరో అధికారి అన్నపూర్ణ విచారించారు. మండల విద్యాధికారిపై ఫిర్యాదులు వాస్తవమేనని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బేతాళ రాజేంద్రప్రసాద్, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్ ప్రసాదరావు, మండలశాఖ అధ్యక్షుడు పి.రాము తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని డీడీ సుల్తానా తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎంఈవో శ్రీనివాసు అన్నారు.
గందరగోళం
ఎంఈవోపై విచారణ అంతా గందరగోళంగా జరిగింది. విచారణలో ఫిర్యాదుదార్లు, అందుకు సంబంధించిన వారే పాల్గొనాలని డీఈవో రాజ్యలక్ష్మి సమాచారం పంపినప్పటికీ, కొంతమంది ఉపాధ్యాయులు ఫిర్యాదులతో సంబంధం లేకపోయినా విచారణలో పాల్గొన్నారు. ఎంఈవోకు అనుకూలంగా వ్యవహరించారు.