ఉద్యోగులంతా కుటుంబంలా మెలగాలి

ABN , First Publish Date - 2020-12-07T06:34:28+05:30 IST

ఉద్యోగులంతా కుటుంబంలా మెలగాలి

ఉద్యోగులంతా కుటుంబంలా మెలగాలి

 విజయవాడ రూరల్‌, డిసెంబరు 6 : ఉద్యోగులంతా ఒక కుటుంబంలా భావించి, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజయవాడ  డీఎల్‌పీవో చంద్రశేఖర్‌ సూచించారు. ఆదివారం మండల పరిషత్‌,  పంచాయతీ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది కార్తీకమాస వనసమారాధన నున్న వికాస్‌ కాలేజీ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా మామిళ్లపల్లి ఫణికుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఎంపీడీఓ జె సునీత, జీటీవీ రమణ, రామ్మోహనరావు,  నాగిరెడ్డి, నరెడ్ల సత్యనారాయణరెడ్డి, జీబీ శ్రీనివాసరావు, ఏఓలు కృష్ణమోహన్‌, శకుంతల, నేతలు చంద్రారెడ్డి, సుబ్రహ్మణరాజు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-07T06:34:28+05:30 IST