-
-
Home » Andhra Pradesh » Krishna » Elections of local bodies in the district
-
స్థానిక ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ABN , First Publish Date - 2020-03-13T10:28:37+05:30 IST
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు కోరారు. మచిలీ పట్నంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు, ఏఎస్పీ సత్తిబాబుతో కలిసి మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు.

ఏలూరు రేంజ్ డీఐజీ మోహనరావు
ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు కోరారు. మచిలీ పట్నంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు, ఏఎస్పీ సత్తిబాబుతో కలిసి మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యా త్మక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికపుడు సమాచారం తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్ని కల్లో పోలీసుల గట్టి నిఘాను ఏర్పాటు చేశారనే భావనను ప్రజల్లో కల్పించా లన్నారు. నగదు, మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికపుడు కనిపెడుతూ ఉండాలన్నారు.
అవసర మైతే వారిని బైండోవర్ చేయాలని సూచించారు. అల్లరి మూకలపై నిఘా ఉంచి అల్లర్లు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకునేలా సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులవద్ద నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఓటర్లు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునేం దుకు అవసరమైన చర్యలను పోలీసులు చేపట్టాలని తెలిపారు.
తనిఖీలు ముమ్మరం చేయండి
ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో తరచూ పోలీసులు తనిఖీలు చేయాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసేవారిపై నిఘా ఉంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళా ఓటర్లు అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాలవద్ద మహిళా పోలీసులను నియమించాలన్నారు. గత ఎన్నికల్లో ఏయే పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక సంఘటనలు జరిగాయి, ప్రస్తుతం ఆయా ప్రాం తాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికపుడు తెలుసుకోవాలని, అందుకు అనుగు ణంగా బందోబస్తును రూపొందించాలన్నారు. రిటర్నింగ్ అధికారులతో సమన్వ యంగా ఉండి ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లైసెన్సు ఆయుధాలను డిపాజిట్ చేయించాలన్నారు. పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలను డీఐజీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ డివిజన్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.