-
-
Home » Andhra Pradesh » Krishna » Ecrop should be accelerated
-
ఈ-క్రాప్ వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-08-20T10:55:57+05:30 IST
జిల్లాలో ఈ-క్రాప్ (ఈ-పంట) నమోదు వేగవంతం చేయాలని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. క్యాంపు కా

విజయవాడ సిటీ, ఆగస్టు 19 : జిల్లాలో ఈ-క్రాప్ (ఈ-పంట) నమోదు వేగవంతం చేయాలని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. మండలస్థాయి అధికారులతో ఈ-క్రాప్ నమోదు, నాడు-నేడు, ప్లాంటేషన్, రైస్ కార్డుల పంపిణీ తదితర అంశాలపై బుధవారం కలెక్టర్ సమీక్షించారు.
ఈ-క్రా్‌ప్ నమోదుకు తొలి ప్రాధాన్యామిచ్చి సమన్వయంతో నూరుశాతం పూర్తి చేయాల న్నారు. రైస్‌కార్డుల పంపిణీని త్వరగా పూర్తిచేయాలన్నారు. కొత్తగా 483 అంగన్ వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి చేయాలన్నారు. ఇళ్ల స్థలాల లేఅవుట్‌లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసి అహ్లాదకరంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామ సచివాలయల భవనాలు, వైఎస్సార్ క్లినిక్‌ల నిర్మాణాల్లో ప్రగతి చూపాలని పంచాయితీరాజ్ అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భూ రికార్డుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వాటిని కచ్చితత్వంతో తయారు చేయాలని జేసీ కె.మాధవీలత తెలిపారు. 78,453 కొత్త రైస్ కార్డులకుగాను 76,167పంపిణీ చేశామన్నారు. జేసీ కె.మోహన్‌కుమార్, డీఆర్డీఏ పీడీ ఎం.శ్రీనివాసరావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.