బెజవాడలో డ్రగ్స్, గంజాయి విక్రేతలు అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-11T01:59:07+05:30 IST

బెజవాడలో డ్రగ్స్, గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెజవాడలో డ్రగ్స్, గంజాయి విక్రేతలు అరెస్ట్

విజయవాడ : బెజవాడలో డ్రగ్స్, గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నాడు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ గహేల్ రసూల్, టాంజానియా దేశానికి చెందిన లిస్వా షబ్బినీలు, ఢిల్లీ చెందిన కోనేరు అర్జున్‌లు ఉన్నారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నిందితుల నుంచి 17 గ్రాముల మెథలైన్ డయాక్సీ మెథాంఫేటమిన్ (MDMA), 150 గ్రాముల గంజాయి, 3 సెల్‌ఫోన్లు, బిట్ కాయిన్స్, సేవించేందుకు ఉపయోగించే హుక్కా పరికరం స్వాధీనం చేసుకున్నారు.


పెనమలూరు కామయ్యతోపుకు చెందిన కోనేరు అర్జున్‌ను అరెస్ట్ చేయటంతో డ్రగ్స్, గంజాయి ఉదంతం వెలుగుచూసింది. కాగా.. గహేల్ రసూల్, లిస్వా షబ్బినీలు నగరంలోని ఇబ్రహీంపట్నంలో ఉంటున్నారు. బెంగళూర్ నుంచి మెథలైన్ డయాక్సీ మెథాంఫేటమిన్ కొనుగోలు చేసి విజయవాడలో విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆ ముగ్గుర్నీ ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అసలు వీరి వెనుక ఎవరెవరున్నారు..? ఏదైనా ముఠా ఉందా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-07-11T01:59:07+05:30 IST