న్యుమోనియాకు కరోనా తోడైతే ప్రమాదమే

ABN , First Publish Date - 2020-07-15T09:02:52+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందు తోంది. జిల్లాలో ప్రమాదకరస్థాయికి చేరు కోవడంతో ప్రతిరోజూ ..

న్యుమోనియాకు కరోనా తోడైతే ప్రమాదమే

పరీక్షలో నెగెటివ్‌ వస్తే ఎక్స్‌రే, సిటిస్కాన్‌లో పాజిటివ్‌ 

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తలు తీసుకోవాలి   

డాక్టర్‌ పి.వి.రామారావు


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): ప్రాణాంతక కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందు తోంది. జిల్లాలో ప్రమాదకరస్థాయికి చేరు కోవడంతో ప్రతిరోజూ 100 నుంచి 200 పైగా ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. వీరందరికీ చికిత్స అందించేందుకు తగిన న్ని మౌలిక సదుపాయాలు అందుబాటు లో లేకపోవడంతో ప్రమాదం లేని బాధితు లను హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైద్యుల సలహాల మేరకు చికిత్స తీసుకోవాలని సూ చిస్తున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని హోం ఐసోలేష న్‌లోనే ఉండాలని వైద్యాధికారులు సూచి స్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనాతో వేగంగా నీరసించి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. చాలామంది ఆసుపత్రికి వెళ్లేలోపే మరణిస్తున్నారు. వీరిలో న్యూ మోనియా రోగులే ఎక్కువ. దీనికి కారణా లేంటి? ప్రమాదాన్ని ముందుగా ఎలా గుర్తించవచ్చు? ఏజాగ్రత్తలతో ప్రాణాలు కాపాడవచ్చు వంటి వివరాలను కొవిడ్‌-19 స్టేట్‌ ఎక్స్‌పర్ట్‌ క్రిటికల్‌ కేర్‌ ప్యానల్‌ అండ్‌ టెక్నికల్‌ ఎడ్వయిజరీ కమిటీ మెంబర్‌, ఆంధ్రా హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.వి. రామారావు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 


న్యుమోనియా అనేది ప్రాణాంతక వ్యాధి. దీనికి కరోనా తోడైతే మరింత ప్రమాదం. చలితోకూడిన జ్వరం, జలుబు, కఫం, దగ్గు, చాతిలో నొప్పి వంటి లక్ష ణాలు కనిపించినప్పుడు న్యుమోనియా వచ్చినట్లుగా నిర్థారించుకోవచ్చు. దాదాపు అవే లక్షణాలున్న కరోనా వైరస్‌ ఊపిరి తిత్తుల్లోకి చేరితే ఆరోగ్యంపై మరింత ప్ర భావం చూపిస్తుంది. చిన్నచిన్న రక్తనాళాల (ఎసిటో రిసెప్టార్స్‌)కు ఈ వైరస్‌ పట్టు కుంటుంది. రక్తనాళాల్లో ఉండే ‘ఎండోథీవి యం’ అనే పొరను చీల్చుకుని ఊపిరితిత్తు ల్లోని కణాల (సెల్స్‌) లోపలకు వెళ్లి వేగం గా బలపడిపోతుంది. దీంతో రక్తనాళాల్లోని రక్తం గడ్డలు (క్లాట్స్‌)గా ఏర్పడిపోతాయి. అవి ఆక్సిజన్‌ సరఫరాకు అడ్డంకిగా మారి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి ఇన్‌ఫెక్షన్స్‌ పెరిగి ఆయాసం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో రోగులు బాధపడుతుంటారు. 


న్యుమోనియా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కరోనా సోకినా 30నుంచి 35శాతం మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గానే వస్తుంది. మళ్లీ ఎక్స్‌రే, సిటి స్కాన్‌ చేస్తే పాజిటివ్‌ నిర్థా రణవుతుంది. వీరికి ప్రారంభంలో లక్షణాలు కనిపించకపోవచ్చు. లోపల ఆరోగ్యం క్షీణిస్తుంది. వీటిపై కొవిడ్‌-19 స్టేట్‌ ఎక్స్‌పర్ట్‌ క్రిటికల్‌ కేర్‌ ప్యానల్‌ అండ్‌ టెక్నికల్‌ అడ్వ యిజరీ కమిటీ రివ్యూ మీటింగ్‌లో చర్చిం చాం. ఆర్టీసీపీసీఆర్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చి నా ఆయాసం, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే వారిని కొవిడ్‌ బాధితు లుగానే పరిగణించి చికిత్స అందించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మార్గదర్శకాలను జారీ చేసింది. 


లక్షణాలు కనిపించని వేలాదిమంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరంతా పైకి సంతోషంగానే కనిపిస్తున్నా లోపల ‘హేపీ హైపోక్షియా’ వల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గవచ్చు. అందుకే హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ప్రతి గంట కూ ఫింగర్‌ పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా రక్తం లో ఆక్సిజన్‌ శాతాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ పరికరం రూ.1500లకే లభిస్తుంది. 6 నిమిషాలపాటు నడిచి మళ్లీ పల్స్‌ పరిశీలించుకోవాలి. రక్తంలో ఆక్సిజన్‌ శాతం 95శాతం మించి ఉంటే ఫర్వాలేదు. తగ్గితే మాత్రం వెంటనే వైద్యులను సంప్ర దించాలి. లేకుంటే ఒకటి, రెండు గంటల్లోనే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. . హేపీ హైపోక్షియాను ముందుగా గుర్తించక పోవడం వల్ల ఎక్కువమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఈ తీవ్రతను బట్టి వైద్యులు సరైన చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఉంటుంది.

Updated Date - 2020-07-15T09:02:52+05:30 IST