విద్యాభివృద్ధికి ‘డాక్టర్‌ ఎర్నేని’ విశేష కృషి

ABN , First Publish Date - 2020-12-13T06:08:30+05:30 IST

విద్యాభివృద్ధికి ‘డాక్టర్‌ ఎర్నేని’ విశేష కృషి

విద్యాభివృద్ధికి ‘డాక్టర్‌ ఎర్నేని’ విశేష కృషి

గుడివాడ టౌన్‌ : జిల్లాలో  విద్యాభివృద్ధికి డాక్టర్‌ ఎర్నేని వెంకటేశ్వరరావు విశేష కృషి చేశారని డ్రెయినేజీ బోర్డు మాజీ చైర్మన్‌, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌ పేర్కొన్నారు. జగన్నాథపురం కమ్మవారి సత్రంలో శనివారం డాక్టర్‌ ఎర్నేని సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యావేత్తగా రాణించిన డాక్టర్‌ ఎర్నేని రైతుగా ఆధునిక సేద్య పద్ధతులు ఆచరించి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రిన్సిపాల్‌గా ఏఎన్నార్‌ కళాశాల అభివృద్ధికి చేసిన కృషి అజరామరమని కరస్పాండెంట్‌ కె.ఎస్‌. అప్పారావు అన్నారు. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, డాక్టర్‌ ఎర్నేని కుటుంబ సభ్యులు సరోజిని, వెంకట రమణ, శైలజ, శశి, ఏఎన్నార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్యకుమార్‌, పూర్వ ప్రిన్సిపాల్‌ పి.సూర్యచంద్రరావు, ఎస్‌.శంకర్‌, ప్రసాద్‌రావు, పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గం పాల్గొని ఎర్నేని వెంకటేశ్వరరావుకు నివాళులర్పించారు. 


Updated Date - 2020-12-13T06:08:30+05:30 IST