కేంద్రంపై పోరాటానికి ‘సై’

ABN , First Publish Date - 2020-11-27T06:32:23+05:30 IST

రంగాలు మాత్రం వేరు. చేసే పనులు వేరు. అందరి అజెండా మాత్రం కేంద్రంపై పోరాటం. రెండు రోజులపాటు నిర్వ హించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉద్యో గులు, ఉపాధ్యా యులు, కార్మికులు, కూలీలు విజయవాడ నగరంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వ హించారు.

కేంద్రంపై పోరాటానికి ‘సై’

విజయవాడ, నవంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): రంగాలు మాత్రం వేరు. చేసే పనులు వేరు. అందరి అజెండా మాత్రం కేంద్రంపై పోరాటం. రెండు రోజులపాటు నిర్వ హించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉద్యో గులు, ఉపాధ్యా యులు, కార్మికులు, కూలీలు విజయవాడ నగరంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వ హించారు. నగరానికి ఉన్న నాలుగు దిక్కుల నుంచి నిరసన ర్యాలీలు చేశారు. వన్‌ టౌన్‌లోని రథం సెంటర్‌ నుంచి పది కార్మిక సంఘాలు, పది స్వతంత్ర ఫెడరేషన్లు నిరసన ప్రదర్శన నిర్వహించి నగరాన్ని ఎర్రజెండాలతో ఎరుపెక్కించాయి. లెనిన్‌ సెంటర్లో నిర్వహిం చిన బహిరంగ సభ వద్ద అన్ని ర్యాలీలు ఏకమయ్యాయి. ఈ నిరసన సభను ఉద్దేశించి ప్రముఖ నాయకులు ప్రసంగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తున్నా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. రెండో రోజైన శుక్రవారం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయించారు.

ఇది మోదీకి చెంపపెట్టు 

రావులపల్లి రవీంద్రనాథ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యోగ, కార్మికులు సమ్మె పాల్గొనడం మాటలు కా దు. ఇది మోదీకి ఒకవిధంగా చెంప పెట్టు. ఉద్యోగులు, కార్మికులు, కూలీలు భుజం భు జం కలిపి సమ్మెను విజయ వంతం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను కాపాడు కోవాలని ఉద్యోగులంతా ఏకమాయ్యరు. 

కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు

ఎంఏ గఫూర్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కార్మికులు బ్రిటీష్‌ వాళ్లతో పోరాడి ఎన్నో చట్టా లను సాధించుకున్నారు. వాటిని మోదీ కాల రాస్తున్నారు. ఇదే పట్టుదలతో రైతులు, ఉద్యో గులు, కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలి. 

ప్రధానితో కార్పొరేట్లకే లాభం

కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ప్రధాని మోదీ పాలనలో కార్పొరేట్‌ కంపెనీలు మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నాయి. వ్యవ సాయ బిల్లులకు వ్యతిరేకంగా వివిధ కార్మిక సంఘాలు ఢిల్లీకి వెళ్తే ఫిరంగుల వర్షం కురి పించారు. అయినా వారెక్కెడా వెనుతిరగలేదు. మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీల వల్ల కార్పొరేట్‌ కంపెనీలే ప్రయోజనాలను పొందాయి. 

ఇదొక కొత్త ఉద్యమ చరిత్ర

పి.మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు చేయిచేయి కలిసి రోడ్డెక్కి నిరసన తెలపడం దేశ ఉద్య మంలో ఒక కొత్త చరిత్ర. ప్రధానికి ఒక హెచ్చ రిక పంపడానికి ఈ నిరసన కార్యక్రమం. ఊహించని స్థాయిలో సమ్మె ఉధృతమైంది. 

పునరుద్ధరణ అంటే వీఆర్‌ఎస్‌ ఇవ్వడమా?

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరిస్తామన్న మోదీ దేశంలో 80వేల మంది ఉద్యోగులక వీఆర్‌ఎస్‌ ఇచ్చి ఇంటికి పంపారు. ఇదే అంశాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు సమ్మెలో ప్రస్తావించారు. సార్వత్రిక సమ్మెలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులతో పాటు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులంతా నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈయూ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌బాబు, అన్వర్‌ బాషా పాల్గొన్నారు.

బీమా ఉద్యోగుల ఆక్రోశం

కేంద్రం బీమా రంగాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరించడంతో ఎల్‌ఐసీ ఉద్యోగులు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఆ శాఖ ఉద్యోగులంతా వ్యతిరేకించారు. బీసెంట్‌ రోడ్డులోని ఎల్‌ఐసీ కార్యాల యం వద్ద వారంతా నిరసన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more