-
-
Home » Andhra Pradesh » Krishna » Devineni Uma Pressmeet
-
ప్రభుత్వానికి ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-11-21T06:15:51+05:30 IST
ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చూసి స్థానిక సంస్థల ఎన్నికల నుండి వైసీపీ పారిపోతోం దని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

పాయకాపురం, నవంబరు 20 : ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చూసి స్థానిక సంస్థల ఎన్నికల నుండి వైసీపీ పారిపోతోం దని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వైసీపీ పాదయాత్రలకు లేని కరోనా ఎన్నికలకు మాత్రం అడ్డు వస్తుందా అని ప్రశ్నించారు. పాఠశాలలు తెరవటం వలన లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు వెళ్తే వారికి కరోనా రాదా, వారి ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి లెక్కలేదా అని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న కమిషనర్‌ను బూతులు తిట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్‌ను తిట్టడం కాదు, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధమవ్వాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.