పంట కొనుగోలులోనూ పార్టీలతో ముడిపెట్టడం బాధాకరం
ABN , First Publish Date - 2020-12-15T05:54:04+05:30 IST
పంట కొనుగోలులోనూ పార్టీలతో ముడిపెట్టడం బాధాకరం
కంచికచర్ల రూరల్, డిసెంబరు 14: రైతులు పండించిన పంటల కొనుగోలులోనూ పార్టీలకు ముడిపెట్టటం బాధాకరమని, పార్టీలకతీతంగా రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గండేపల్లి, కీసర గ్రామాల్లో ఇటీవల వర్షాలు, వరదలకు తడిసిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. త్వరితగతిన పంట నష్టం వివరాలు సేకరించి, రైతులకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు కోగంటి బాబు, మందడపు రామకృష్ణ, బొక్కా దేవానందం, బొక్కా వీరయ్య, ప్రసాదరావు, కుక్కల శ్రీను, మార్త నరసింహారావు, రోశయ్య, షేక్ బాజీ పాల్గొన్నారు.