పోలవరం ప్రాజెక్టును సీఎం వదిలేశారు
ABN , First Publish Date - 2020-12-13T06:06:05+05:30 IST
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం
నందిగామ రూరల్, డిసెంబరు 12: జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలలుగా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందన్నారు. పోలవరం నిర్వాసితుల గురించి కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడలేకపోతున్నారన్నారు. డ్యాంలో ఏం జరుగుతోంది? నిర్వాసితులను ఏం చేయదలచుకున్నారో కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ధ్వజమెత్తారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి పాల్గొన్నారు.