విశాలాంధ్ర సంపాదకుడు ముత్యాల ప్రసాద్‌కు నివాళి
ABN , First Publish Date - 2020-12-07T06:25:39+05:30 IST
విశాలాంధ్ర సంపాదకుడు ముత్యాల ప్రసాద్‌కు నివాళి

విజయవాడ సిటీ : విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు ముత్యాల ప్రసాద్ మృతి పత్రికా రంగానికి తీరనిలోటని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు అన్నారు. ఇటీవల మృతిచెందిన ముత్యాల ప్రసాద్ సంతాప సభ ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభ్యుదయ రచయితగా ఆయన ఎంతో గుర్తింపు పొందారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ పూర్ణచందు, యూనియన్ జిల్లాశాఖ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు చలపతిరావు, వసంత్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముత్యాల ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.