కంటైన్మెంట్‌ జోన్లు తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-12-31T05:07:48+05:30 IST

కంటైన్మెంట్‌ జోన్లు తగ్గుముఖం

కంటైన్మెంట్‌ జోన్లు తగ్గుముఖం

బుధవారం రికార్డుస్థాయిలో 23 జోన్లు ఎత్తివేత 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్లు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో మొత్తం 23 కంటైన్మెంట్‌ జోన్లను ఆ పరిధి నుంచి తప్పించారు. ఈ గ్రామాల్లో 28 రోజులుగా ఎలాంటి కరోనా కేసులు నమోదుకానందున వాటిని తొలగించారు. ఆగిరిపల్లి మండలం కృష్ణవరం, చాట్రాయి మండలంలోని చిత్తపూరు,  గన్నవరం మండలంలోని దావాజీగూడెం, అల్లాపురం, గుడివాడతో పాటు గుడివాడ మండలంలోని బిళ్లపాడు, చౌటపల్లి, రాయవరం, ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ, జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ, కైకలూరు మండలంలోని గోపవరం, రాయవరం, కలిదిండి మండలంలోని మూలలంక, సంతోషపురం, కృత్తివె న్ను మండలంలోని చెరుకుమిల్లి, మచిలీపట్నం మండలంలోని కొత్తపూడి, మోపిదేవి మండలంలోని పల్లెపాలెం, గొల్లపాలెం, నూజివీడు మండలంలోని పోతిరెడ్డిపల్లి, పమిడిముక్కల మండలంలోని కృష్ణాపురం, చోరగుడి, పెనమలూరు మండలంలోని చినపులిపాక, విస్సన్నపేట మండలం పుట్రేలను కంటైన్మెంట్‌ పరిధి నుంచి తొలగించారు. జగ్గయ్యపేట మండలంలోని షేర్‌మహమ్మద్‌పేటలో కరోనా కేసులు నమోదు కావడంతో బుధవారం ఆ గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఉత్తర్వులు చేశారు. 

Updated Date - 2020-12-31T05:07:48+05:30 IST