-
-
Home » Andhra Pradesh » Krishna » darna at pb siddartha college
-
జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-30T06:19:55+05:30 IST
ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పోస్టు గ్రాడ్యు యేషన్ కళాశాల విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య, విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మంగళవారం మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల ఎదుట ధర్నా జరిగింది.

జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలి
మొగల్రాజపురం, డిసెంబరు 29: ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పోస్టు గ్రాడ్యు యేషన్ కళాశాల విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, వసతి దీవెన, విద్యాదీవెన పథకాలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 77ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతి శీల ప్రజాస్వామ్య, విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో మంగళవారం మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ కళాశాల ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నగర నాయకులు ఐ. రాజేష్ మాట్లాడుతూ ఈ జీవో వల్ల వేలాది మంది ఎస్పీ, ఎస్టీ విద్యార్థులు పీజీ విద్యకు దూరం అవుతారన్నారు. కృష్ణ, భార్గవ్, అశోక్ పాల్గొన్నారు.