రైతులకు మద్దతుగా ధర్నా
ABN , First Publish Date - 2020-12-05T05:54:16+05:30 IST
కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న డిమాండ్ చేశారు.
రైతులకు మద్దతుగా ధర్నా
గవర్నర్‌పేట, డిసెంబరు 4: కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రసన్న డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతులు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్, డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.