ఆర్టీసీకి నష్టకాలం

ABN , First Publish Date - 2020-04-14T09:25:59+05:30 IST

ఆర్టీసీ రెండు రకాలుగా నష్టపోతోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో బస్సులన్నీ మూలకు చేరగా, పార్శిళ్లు, కొరియర్‌

ఆర్టీసీకి నష్టకాలం

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఆర్టీసీ రెండు రకాలుగా నష్టపోతోంది. ఇప్పటికే లాక్‌డౌన్‌తో బస్సులన్నీ మూలకు చేరగా, పార్శిళ్లు, కొరియర్‌ ద్వారా కూడా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. పాసింజర్‌ ఆపరేషన్‌లో రోజుకు రూ.కోటిన్నర మేర ఆదాయాన్ని కోల్పోయిన కృష్ణా రీజియన్‌.. పార్శిళ్లు, కొరియర్‌ ద్వారా ఈ లాక్‌డౌన్‌ కాలం మొత్తంలో రూ.48లక్షలు పోగొట్టుకుంది. లాక్‌డౌన్‌ మరో పక్షం రోజులు కొనసాగితే కోల్పోయే ఆదాయం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది.


ఆపరేషనల్‌ పరంగా ఆదాయాన్ని కోల్పోయినా కనీసం కొరియర్‌ అండ్‌ పార్శిళ్ల రవాణా ద్వారా అయినా ఆదాయం ఆర్జించే పరిస్థితి లేకుండాపోయింది. సాధారణ బస్సులు తిరిగితేనే ఆర్టీసీ ద్వారా కార్గో రవాణా జరుగుతుంది.  ఇవికాకుండా ప్రతి డిపోకు ఒక డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డీజీటీ) వాహనం ఉంటుంది. ఈ వాహనాల్లో వైద్యశాఖకు సంబంధించిన మందులు, ఇతర స్టేషనరీ, అత్యవసర ఎక్విప్‌మెంట్‌ రవాణా చేస్తున్నారు. సింహభాగం రవాణా మాత్రం సాధారణ బస్సుల్లోనే జరగాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-04-14T09:25:59+05:30 IST