పంట చేలో దమ్ము

ABN , First Publish Date - 2020-12-03T06:49:32+05:30 IST

కంటికి రెప్పలా కాపాడుకున్న పంటని చేతికొచ్చే సమయానికి ‘నివార్‌’ ముంచేసింది.

పంట చేలో దమ్ము

కంటికి రెప్పలా కాపాడుకున్న పంటని చేతికొచ్చే సమయానికి ‘నివార్‌’ ముంచేసింది. వేల రూపాయల పెట్టుబడి వృథా కాగా, నీట మునిగిన పంటను కోయించినా ఖర్చు దండగని భావించిన ఆ రైతులు గుండె దిటవు చేసుకుని దమ్ము చెక్రాలతో పంటను తొక్కించేశారు. ఉయ్యూరుకు చెందిన రైతులు పోలగాని రెడ్డిబాబు, పమిడిముక్కల మండలం గురజాడకు చెందిన రాజుపాటి శ్రీనివాసరావు నాలుగు ఎకరాల్లో వరిపంటను ఇలా దమ్ము చక్రాలతో తొక్కించేశారు. - ఉయ్యూరు


Updated Date - 2020-12-03T06:49:32+05:30 IST