అమరావతి ఉద్యమానికి మంచి రోజులు వస్తాయ్: మధు

ABN , First Publish Date - 2020-12-10T18:13:56+05:30 IST

అమరావతి ఉద్యమానికి మంచి రోజులు వస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.

అమరావతి ఉద్యమానికి మంచి రోజులు వస్తాయ్: మధు

అమరావతి: అమరావతి ఉద్యమానికి మంచి రోజులు వస్తాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ ఉద్యమం జయప్రదం అయితే మనం కూడా జయప్రదం అవుతామని తెలిపారు. అమరావతి అందరికి సమానదూరంలో ఉందన్నారు. జేఏసీ ఎవరినో ఒకరినో భుజనా వేసుకుంటే అమరావతి ఉద్యమానికి ముక్తి ఉండదన్నారు. ఉద్యమం విజయవంతం కావాలంటే 10 మందితో కలిసి పని చేయాలని సూచించారు. ఉమ్మడి ఆశయం, లక్ష్యం మార్గం మంచిదై ఉండాలన్నారు. ఇది భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాబోతోందని స్పష్టం చేశారు. మూడు రాజధానిల పేరుతో రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేయవద్దు అని.. రాజధాని మార్చడం అనేది ప్రజలు అంగీకరించరని మధు తేల్చిచెప్పారు. Updated Date - 2020-12-10T18:13:56+05:30 IST