ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని ఉపసంహరించుకోవాలి: బాబు రావు

ABN , First Publish Date - 2020-12-11T19:16:26+05:30 IST

ఆస్తి పన్ను విధింపు విధానాన్ని మార్చుతూ చేసిన చట్ట సవరణ నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యచరణను పౌర సంక్షేమ సంఘం ప్రకటించనున్నట్లు సీపీఎం నేత బాబురావు తెలిపారు.

ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని ఉపసంహరించుకోవాలి: బాబు రావు

అమరావతి: ఆస్తి పన్ను విధింపు విధానాన్ని మార్చుతూ చేసిన చట్ట సవరణ నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యచరణను పౌర సంక్షేమ సంఘం ప్రకటించనున్నట్లు సీపీఎం నేత బాబురావు తెలిపారు. శుక్రవారం పౌర సంక్షేమ సంఘం, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపైన పెను భారాలను పెంచుతున్నాయని మండిపడ్డారు. పనికిరాని సంక్షేమ పథకాలను పెట్టి ప్రజల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో దండుకుంటున్నారన్నారు. కేవలం 15 శాతం మాత్రం పెంచడం అయితే అసలు చట్ట సవరణ అవసరం లేదని చెప్పారు. ఆస్తి పన్ను కనక పెంచితే సొంత ఇళ్ల వాళ్లతో పాటు అద్దెకుండే వారికి కూడా పెను భారం తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆస్తి పన్ను చెల్లింపు విధానాన్ని ఉపసంహరించుకోవాలని... లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపడతామని బాబు రావు హెచ్చరించారు. 

Updated Date - 2020-12-11T19:16:26+05:30 IST