పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-11-26T06:15:11+05:30 IST

పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలి

పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలి
పన్నుల భారం మోయలేమంటూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న నాయకులు

సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ సిటీ : ప్రజలపై భారం పడేలా పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, జిల్లా నేత దోనేపూడి కాశీనాథ్‌ హెచ్చరించారు. ఆస్తిపన్ను, మంచినీరు, డ్రెయినేజీ చార్జీల పెంపు ఆర్డినెన్స్‌, జీవోలకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌ వద్ద బుధవారం  ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడి రాష్ట్రప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందన్నారు. పెంచిన పన్నుల ఆర్డినెన్స్‌ 16, జీవోలు 196, 197 ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని సాగిస్తామని హెచ్చరించారు. అనంతరం పన్నులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌, జీవోలను దగ్ధం చేశారు. నీటీ చార్జీలు, ఆస్తిపన్ను పెంపును నిరసిస్తూ కార్యకర్తలు ఖాళీ బిందెలు, ఇంటి బొమ్మలతో వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నాయకులు డి.విష్ణువర్ధన్‌, బి.రమణ, కె.దుర్గారావు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-26T06:15:11+05:30 IST