ఉచిత విద్యుత్‌కు మీటర్ల బిగింపు ఎందుకు?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-13T15:38:30+05:30 IST

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం మీటర్లు బిగింపు ఎందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు.

ఉచిత విద్యుత్‌కు మీటర్ల బిగింపు ఎందుకు?: రామకృష్ణ

అమరావతి: రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్  కోసం మీటర్లు బిగింపు ఎందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. విద్యుత్ మీటర్ల ఏర్పాటు కోసం రూ.1000 కోట్ల ప్రజాధనం వృధా ఖర్చు కాదా అని నిలదీశారు. మీటర్ల రీడింగు, నెలవారి బిల్లులు తీయటం, బిల్లుల చెల్లింపులు వంటి పనులు అదనపు భారం కాదా అని ఆయన మండిపడ్డారు. కేవలం రూ.4 వేల కోట్ల అప్పు కోసం కేంద్రం అనుమతికై రైతుల పొట్ట కొట్టడం తగునా అని విమర్శించారు. డిస్కంల ప్రైవేటీకరణకు, విద్యుత్తును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌కు దశలవారీగా మంగళం పాడేందుకు చేస్తున్న కుట్రలో భాగమే విద్యుత్ మీటర్లు బిగింపు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియను తిరస్కరించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-10-13T15:38:30+05:30 IST