రైతులేమన్నా తీవ్రవాదులా? దోపిడీదారులా?: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-10-28T13:30:51+05:30 IST

రైతులకు బేడీలు వేసిన ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు క్షమించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతులేమన్నా తీవ్రవాదులా? దోపిడీదారులా?: రామకృష్ణ

అమరావతి: రైతులకు బేడీలు వేసిన ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు క్షమించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసు పెట్టి పోలీసులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పైగా రైతులకు బేడీలు వేసి తిప్పుతున్నారని... వాళ్లేమన్నా తీవ్రవాదులా? దోపిడీదారులా? కరడుగట్టిన నేరస్థులా? అని ప్రశ్నించారు. అమరావతి రైతులని భయపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. వరద బాధితులను పరామర్శించే వారిపై కూడా కేసులు పెడతారా అని రామకృష్ణ ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-28T13:30:51+05:30 IST