కృష్ణాలో కొత్త స్ట్రెయిన్‌ కలకలం

ABN , First Publish Date - 2020-12-29T07:05:47+05:30 IST

యూకేలో మొదలైన కరోనా కొత్త స్ట్రెయిన్‌ జిల్లాలోనూ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్‌ నుంచి ఇటీవల జిల్లాకు వచ్చిన మరికొందరికి పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

కృష్ణాలో కొత్త స్ట్రెయిన్‌ కలకలం

యూకే నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

యూకేలో మొదలైన కరోనా కొత్త స్ట్రెయిన్‌ జిల్లాలోనూ కలకలం సృష్టిస్తోంది. బ్రిటన్‌ నుంచి ఇటీవల జిల్లాకు వచ్చిన మరికొందరికి పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆ వైరస్‌ యూకేలో మొదలైన కొత్త స్ర్టెయిన్‌కు సంబంధించినదా? కాదా? అనేది తెలుసుకునేందుకు వారి నుంచి మరోసారి శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌ లోని సీసీఎంబీకి పంపించారు. ఆ రిపోర్టులు రావడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు. 

ఇటీవల యూకే నుంచి విజయవాడకు వచ్చిన ఓ యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడి నుంచే వచ్చిన మరో ముగ్గురికి కూడా పాజిటివ్‌ అని తేలడంతో అధికారులు మళ్లీ అప్రమత్తమయ్యారు. ఆ ముగ్గురినీ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఎవరికైనా లక్షణాలు బయటపడితే వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ ఎం.సుహాసిని తెలిపారు. 

Updated Date - 2020-12-29T07:05:47+05:30 IST