కృష్ణా జిల్లాలో కొత్తగా 121 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-10T06:25:17+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం అత్యధికంగా 121 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కృష్ణా జిల్లాలో కొత్తగా 121 మందికి కరోనా

మరో బాధితుడు మృతి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): జిల్లాలో కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. బుధవారం అత్యధికంగా 121 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో బాధితుడు కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,386కి చేరింది. కరోనా మరణాలు అధికారికంగా 651కి చేరుకున్నాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ బాధితుల్లో 87 మంది గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 1,042 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే జిల్లాలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

Updated Date - 2020-12-10T06:25:17+05:30 IST