-
-
Home » Andhra Pradesh » Krishna » covid
-
24 గంటల్లో 224 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-11-25T06:25:03+05:30 IST
జిల్లాలో తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా మళ్లీ కోరలు చాచి.. కన్నెర్ర జేసింది.

మరో ఇద్దరు బాధితులు మృతి
263 మంది కోలుకుని డిశ్చార్జి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
జిల్లాలో తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా మళ్లీ కోరలు చాచి.. కన్నెర్ర జేసింది. సోమవారం జిల్లావ్యాప్తంగా కేవలం 44 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, 24 గంటల్లో మంగళవారం ఉదయానికి కొత్తగా 224 మందికి ప్రాణాంతక వైరస్ సోకింది. మరో ఇద్దరు బాధితులు కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 44,745కు ఎగబాకాయి. కరోనా మరణాలు అధికారికంగా 626కు చేరుకున్నాయి. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ బాధితుల్లో మరో 263 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా, ఇంకా 1,705 మంది ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. చలికాలంలో వైరస్ మరింత విజృంభించే అవకాశముందని, ప్రజలు వైరస్ బారినపడకుండా మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.