మరో 70 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-07-05T10:06:02+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 70 మందికి వైరస్‌ సోకింది.

మరో 70 మందికి కరోనా

 ఆంధ్రజ్యోతి, విజయవాడ/నూజివీడు/మైలవరం : జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 70 మందికి వైరస్‌ సోకింది. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని కార్యాలయంలో పనిచేసే వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తున్నారు. దీంతో మంత్రి కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచిం చినట్లు తెలిసింది. కాగా, జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,681కి చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 68 మంది మరణించగా, 669 మంది కోలుకున్నారు. 944 మంది చికిత్స పొందుతున్నారు. శనివారం నమోదైన కేసులు నగర చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవే. 


నూజివీడులో 12 కేసులు 

నూజివీడుతో పాటు రూరల్‌, ముసునూరు మండలాల్లో శనివారం 12 కరోనా కేసులు వెలుగుచూశాయి. చెక్కపల్లి గ్రామంలో బ్యాంక్‌ ఉద్యోగికి, గోపవరంలో మరో బ్యాంక్‌ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించాయి. మైలవరం పట్టణంలోని బందగరువులో ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు తహసీల్దార్‌ రోహిణీదేవి తెలిపారు. 

Updated Date - 2020-07-05T10:06:02+05:30 IST