కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య.. 3021..

ABN , First Publish Date - 2020-07-18T16:42:07+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు మూడు వేలు దాటేశాయి. శుక్రవారం కొత్తగా 37 మందికి వైరస్‌ సోకింది. వీరితో కలిపి జిల్లాలో కరోనా మొత్తం పాజిటివ్‌ బాధితుల సంఖ్య 3021కి చేరుకుంది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో

కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య.. 3021..

కొత్తగా 37 మందికి వైరస్‌ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో కరోనా కేసులు మూడు వేలు దాటేశాయి. శుక్రవారం కొత్తగా 37 మందికి వైరస్‌ సోకింది. వీరితో కలిపి జిల్లాలో కరోనా మొత్తం పాజిటివ్‌ బాధితుల సంఖ్య 3021కి చేరుకుంది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మరణించాడు. దీంతో అధకారికంగా కరోనా మరణాల సంఖ్య 86కు చేరుకుంది. ఇంతవరకు 2108 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. ఇంకా 827 మంది చికిత్స పొందుతున్నారు. 


బందరు డివిజన్లో మరో 8 కేసులు 


మచిలీపట్నం టౌన్‌ : బందరు డివిజన్‌లో కొత్తగా మరో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. మచిలీపట్నంలో 3, చిలకలపూడి, నిజాంపేట, గూడూరు మండలం లేళ్లగరువుల్లో ఒక్కొక్కటి, అవనిగడ్డలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. 


చల్లపల్లిలో బ్యాంకు అధికారికి పాజిటివ్‌

చల్లపల్లిలోని ఓ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌కు పాజిటివ్‌ వచ్చింది. వైద్యఆరోగ్యశాఖలో మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. 


జగ్గయ్యపేటలో మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ రామకృష్ణ చెప్పారు.    


ఉయ్యూరు పట్టణంలోని ఫ్లోరా స్కూల్‌ రోడ్డులో ఓవ్యక్తికి, గండిగుంట దత్తఆశ్రమ ప్రాంతంలో మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు.


కైకలూరులో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పెద్దమసీదు సమీపంలో ఓ వ్యాపారికి, వెలమపేటలో ఓ గర్బిణీకి, గోపవరంలో ఒక యువకునికి పాజిటివ్‌గా నిర్ధారించారు.


Updated Date - 2020-07-18T16:42:07+05:30 IST