ఆగస్టు 15 నాటికి దుర్గ ఫ్లైఓవర్ పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-06-11T09:00:10+05:30 IST
కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణా ళికలు సిద్దం ..

వన్‌టౌన్, జూన్ 10 : కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేసి ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణా ళికలు సిద్దం చేయాలని అధికారులకు కలెక్టర్ ఇంతి యాజ్ స్పష్టం చేశారు. కృష్ణవేణి ఘాట్ వద్ద, భవా నీపురంలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పను లను బుధవారం ఎన్‌హెచ్ అధికారులు, నిర్మాణ సంస్థ సోమా ప్రాజెక్టు ప్రతినిధులతో కలిసి పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పను లను చేపట్టాలన్నారు. ఇందుకోసం అవసరమైన సిబ్బంది, కార్మికుల ద్వారా పనులు నిర్వహించుకు నేందుకు 300 మంది కార్మికులను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల ఎస్సై జాన్ మోషే, సోమా సంస్థ ప్రా జెక్టు మేనేజర్ అనంతరాములు మాట్లాడుతూ 48 గంటల్లో కలెక్టర్‌కు వివరాలు తెలుపుతామన్నారు.