ఇళ్ల పంపిణీని సమర్థవంతంగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2020-06-25T09:44:06+05:30 IST

అర్హులైన పేదలకు ఇళ్లస్థలాల పంపిణీని సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో ముందుకువెళ్లాలని జేసీ కె.మాధవీలత అన్నారు.

ఇళ్ల పంపిణీని సమర్థవంతంగా పూర్తి చేయండి

జేసీ కె.మాధవీలత


విజయవాడ సిటీ: అర్హులైన పేదలకు ఇళ్లస్థలాల పంపిణీని సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో ముందుకువెళ్లాలని జేసీ కె.మాధవీలత అన్నారు. నివేశిత స్థలాల అభివృద్ధి పనులపై ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లతో జేసీ క్యాంపు కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ హెచ్‌ఎం ధ్యానచంద్రతో కలిసి ఆమె బుధవారం సమీక్షించారు. పెనమలూరు, కంకిపాడు, విజయవాడ రూరల్‌, గన్నవరం, ఉంగుటూరు, జి.కొండూరు మండలాల్లో 1100 ఎకరా ల్లో 62 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు ఇచ్చే ప్లాట్లు అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లు, సర్వేయర్లు  పాల్గొన్నారు.

Updated Date - 2020-06-25T09:44:06+05:30 IST