నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ఫిర్యాదులు

ABN , First Publish Date - 2020-03-24T10:05:52+05:30 IST

విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో నిత్యా వసర వస్తువులు ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాలశాఖ(డీఎస్‌వో) మచిలీపట్నం కార్యాలయంలోని అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు.

నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ఫిర్యాదులు

విజయవాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో నిత్యా వసర వస్తువులు ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్న నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాలశాఖ(డీఎస్‌వో) మచిలీపట్నం కార్యాలయంలోని అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు. విజయవాడ ప్రాంతం నుంచి ఒక్కో అధికారికి కనీసంగా  పది మందికి పైగా ఫోస్లు చేసి ఫిర్యాదు చేశారని డీఎస్‌వో కార్యాలయ అధికారులు తెలిపారు.  మచిలీపట్నంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్ల వద్ద మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా జరుపుతున్నా  ఎక్సైజ్‌ అధికారులు పట్టించు కోలేదని ఫిర్యాదులొచ్చాయి.

Read more