డయాలసిస్‌ రోగులకు ప్రైవేట్‌ ఆసుపత్రులు

ABN , First Publish Date - 2020-04-01T09:30:37+05:30 IST

విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలను కోవిడ్‌-19 హాస్పటల్స్‌గా మార్చినందున డయాలసిస్‌ చేయించుకొనే రోగులకు ప్రత్యామ్నాయంగా నగరంలో తొమ్మిది ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డయాలసిస్‌ రోగులకు ప్రైవేట్‌ ఆసుపత్రులు

కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడి


విజయవాడ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కళాశాలలను కోవిడ్‌-19 హాస్పటల్స్‌గా మార్చినందున డయాలసిస్‌ చేయించుకొనే రోగులకు ప్రత్యామ్నాయంగా నగరంలో తొమ్మిది ప్రైవేట్‌ ఆసుపత్రులు గుర్తించామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్లోబల్‌, టైమ్‌ హాస్పటల్‌, అరుణ్‌, సెంటినీ, సాయిస్వరూప, విజయ సూపర్‌ స్పెషాలిటీ, లిబర్టీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్‌ చేయించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. డయాలసిస్‌ రోగులు ఈ మార్పును గమనించి, ఆయా ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. 


Updated Date - 2020-04-01T09:30:37+05:30 IST