రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-12-03T06:06:09+05:30 IST

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
తడిసిన వరిని పరిశీలిస్తున్న శశిధర్‌, సెంట్రల్‌ కమిటీ సభ్యులు

 కంకిపాడు, డిసెంబరు 2 : నివర్‌ తుఫాను కారణంగా రంగు మారిన ధాన్యాన్ని  సీఎం ఆదేశాల మేరకు కొనుగోలు చేయనున్నట్లు   పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ అన్నారు.  మండలంలోని పునాదిపాడు, దావులూరు, ప్రొద్దుటూరు గ్రామాల పరిధిలో నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బ తిన్న పంట పొలాలను కేంద్ర కమిటీ సభ్యులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శశిధర్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తుఫాన్‌ ఆగిన వెంటనే కేంద్ర కమిటీ సభ్యులు రావటం, పంట నష్ట  అంచనాలను రూపొందించటం చకచకా జరిగిపోతుందన్నారు.  ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ కమిటీ సభ్యులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కోల్‌కత ఎ.కె. డే, సాంకేతిక అధికారి ప్రభాకరన్‌, వాసుదేవ్‌, ఎఫ్‌సీఐ మేనేజర్‌ ఎం. శ్రీధర్‌ నాయక్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, తహసీల్దార్‌ టి.వి.సతీష్‌, ఏఎంసీ చైర్మన్‌ మద్దాలి రామచంద్రరావు, ఏవో కిరణ్‌కుమార్‌,  రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:06:09+05:30 IST