ఆన్‌లైన్‌లో మోసపోయిన సివిల్‌ ఇంజనీర్‌

ABN , First Publish Date - 2020-03-12T10:01:35+05:30 IST

పోరంకికి చెందిన సివిల్‌ ఇంజనీర్‌ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌లో రూ.14 వేల ధర కలిగిన ఫోన్‌ను బుక్‌ చేసి అదనంగా రూ.7.34 లక్షలకు పైగా నగదు చెల్లించి మోసపోయాడు.

ఆన్‌లైన్‌లో మోసపోయిన సివిల్‌ ఇంజనీర్‌

 పది రోజుల్లో వివిధ బ్యాంకు అకౌంట్ల నుంచి నగదు బదిలీ

 రూ.14 వేల ఫోన్‌ బుక్‌ చేసి రూ.7.34 లక్షలు చెల్లించాడు


పోరంకి (పెనమలూరు), మార్చి 11: పోరంకికి చెందిన సివిల్‌ ఇంజనీర్‌ కొత్త మొబైల్‌ను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్‌లో రూ.14 వేల ధర కలిగిన ఫోన్‌ను బుక్‌ చేసి అదనంగా రూ.7.34 లక్షలకు పైగా నగదు చెల్లించి మోసపోయాడు. 15 రోజులు గా ఈ వ్యవహారం జరుగుతున్నా అతను గుర్తించ లేకపోయాడు. చివరికి బుధవారం పోలీసులను ఆశ్ర యించగా కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పోరంకికి చెందిన కోగంటి కార్తీక్‌ సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన ఆన్‌లైన్‌లో ఓ సంస్థలో రూ 14 వేలకు ఓ మొబైల్‌ ఫోన్‌కు ఆర్డర్‌ చేసి ఆన్‌లైన్‌లో సదరు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. మరుసటి రోజు అతనికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తాను ఆర్డర్‌ చేసిన మొబైల్‌ ఫోన్‌ యూ ఎస్‌ నుంచి డెలివరీ అవ్వాల్సి ఉందని కనీసం మూ డు నుంచి నాలుగు సెల్‌ఫోన్లు ఆర్డర్‌ చేస్తే తాము డెలివరీ చేస్తామన్నాడు. నాలుగు సెల్‌ఫోన్లు తన పేరుపై డెలివరీ చేస్తున్నట్లు కార్తీక్‌కు తెలిపాడు. అదే రోజు మళ్లీ ఫోన్‌ చేసి మీ ఫోన్లు కస్టమ్స్‌ అధి కారులు పట్టుకున్నారని విడిపించడానికి రూ.20 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని చెప్పడంతో ఆ మొత్తా న్ని ఆన్‌లైన్‌లో చెల్లించాడు. ఆ మరుసటి రోజు మళ్లీ అదే వ్యక్తి ఫోన్‌ చేసి కస్టమ్స్‌ అధికారులు మొబైల్‌ ఫోన్లను పట్టుకున్నారని వాటిని విడిపించకపోతే మీపై కూడా కేసులు నమోదు చేస్తారంటూ బెదిరిం చడంతో భయపడిన కార్తీక్‌ అప్పటి నుంచి పది రోజుల్లో నాలుగు బ్యాంకు అకౌంట్ల ద్వారా రూ.7 లక్షలకు పైగా నగదును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేశా డు. దాదాపు 15 రోజులు నిరీక్షిస్తున్నా తాను ఆర్డర్‌ చేసిన ఫోన్లు రాకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

Updated Date - 2020-03-12T10:01:35+05:30 IST