గుడివాడలో ఘనంగా వేడుకలు

ABN , First Publish Date - 2020-12-26T06:01:56+05:30 IST

ఏలూరు రోడ్‌లోని మౌంట్‌ కర్మెల్‌ (ఆర్‌సీఎం), కోతిబొమ్మ సెంట ర్‌లోని అవిలాపురి చిన్నతేరేజమ్మ (ఆర్‌సీఎం-2) దేవాలయాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

గుడివాడలో ఘనంగా వేడుకలు

గుడివాడ టౌన్‌: ఏలూరు రోడ్‌లోని మౌంట్‌ కర్మెల్‌ (ఆర్‌సీఎం), కోతిబొమ్మ సెంట ర్‌లోని అవిలాపురి చిన్నతేరేజమ్మ (ఆర్‌సీఎం-2) దేవాలయాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వలివర్తిపాడు రోడ్‌లోని గాస్పెల్‌ ప్రేయర్‌టెంపుల్‌ మినిస్ట్రీస్‌ ప్రేయర్‌ హాల్లో మినిస్ట్రీస్‌ అధ్యక్షుడు సజ్జా బర్న బాస్‌, బేతవోలు నిమ్మతోట చర్చిలో పాస్టర్‌ సంకూరి అనిల్‌బాబు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు గంటాప్రసాద్‌, బంటుమిల్లి యోహాన్‌, జి.కిరణ్‌ క్రీస్తు సందేశా నందించారు. రైల్వే స్టేషన్‌ రోడ్డులోని సీఎస్‌ఐ  చర్చిలో పాస్టర్‌ రాజేష్‌, ఫుల్‌ గాస్పెల్‌ చర్చిలో బిషప్‌ అప్పికట్ల జాషువా, నాగవరప్పాడులో రివైవల్‌ పెంతెకోస్తు మినిస్ట్రీస్‌, చౌదరిపేటలోని షోలోమ్‌ ప్రార్థనా మందిరం, మందపాడులో ఫిలిదెల్ఫియా ప్రార్థన మందిరం, సీయోను గాస్పెల్‌ ఫెలోషిప్‌ చర్చి, పెదఎరుకపాడులో న్యూలైఫ్‌ ప్రార్థనా మందిరం, బాపూజీనగర్‌, కార్మికనగర్‌, పంచవటి కాలనీ, క్రీస్తు ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు.

Updated Date - 2020-12-26T06:01:56+05:30 IST