దేశవాళి ఆవు జాతులను అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2020-03-21T10:20:39+05:30 IST

దేశవాళి ఆవు జాతులను అభివృద్ధి చేయాల్సి అవసరం ఉందని త్రిదండి చినజీయర్‌ స్వామిజీ అభిప్రాయపడ్డారు.

దేశవాళి ఆవు జాతులను అభివృద్ధి చేయాలి

చినజీయర్‌ స్వామిజీచిట్టినగర్‌, మార్చి 20 : దేశవాళి ఆవు జాతులను అభివృద్ధి చేయాల్సి అవసరం ఉందని త్రిదండి చినజీయర్‌ స్వామిజీ అభిప్రాయపడ్డారు. విజయవాడ చిట్టినగర్‌లోని విజయ పాల ఫ్యాక్టరీలో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో రూ.20కోట్లతో నిర్మించిన పాత ఉత్పత్తి భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం స్వామిజీ మాట్లాడుతూ 1947లో 72 జాతుల ఆవులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 22కు పరిమితమైందన్నారు. ఆవు పాలతో తయారు చేసిన ఉత్పత్తులు ఆరోగ్యానికి శ్రేయస్కరమని చినజీయర్‌ స్వామిజీ అన్నారు. రైతులు అభివృద్ధి చెందితేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గోవు మూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని వివరించారు. అనంతరం 175, 450 గ్రాముల టోన్డ్‌ పెరుగు ప్యాకెట్లను ప్రారంభించారు.


కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజ నేయులు మాట్లాడుతూ జిల్లా రైతుల కష్టంతో ఈ మిల్క్‌ ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. 60 సంవత్సరాల క్రితం జిల్లాలోని పాడి రైతుల కోసం ఈ ఫ్యాక్టరీని స్థాపించారన్నారు. దాని ఉపయోగం ప్రస్తుతం కనిపిస్తోం దన్నారు. పాలను ఉత్పత్తిని చేయడమే కాకుండా బై ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తున్నామన్నారు. రైతుల పశువులకు మొబైల్‌ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.  రైతులకు ఆంధ్రా, రమేష్‌ ఆస్పత్రుల సౌజన్యంతో హెల్త్‌కార్డులు అందజేస్తున్నామన్నారు. కొత్తగా విజయ బ్రాండ్‌తో ఐస్‌క్రీమ్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టామన్నారు.

Updated Date - 2020-03-21T10:20:39+05:30 IST