వ్యాక్సినేషన్‌కు ముమ్మర చర్యలు

ABN , First Publish Date - 2020-12-28T06:24:00+05:30 IST

కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా ప్రజలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వ్యాక్సినేషన్‌కు ముమ్మర చర్యలు

డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని సందర్శించిన సెంట్రల్‌ టీమ్‌

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 27 : కొవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా ప్రజలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకుగాను జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఉన్న స్టాక్‌ పాయింట్‌ను కేంద్ర పరిశీలకులు ఆదివారం పరిశీలించారు. ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డా. చర్మిష్టతో సమీక్షించారు. వ్యాక్సినేషన్‌ మైనస్‌ ఎనిమిది డిగ్రీల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌ బయోటెక్‌, సీరం కంపెనీలు జిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నానికి వ్యాక్సిన్‌ను పంపుతున్నాయని, జిల్లాలోని సీనియర్‌ సిటిజన్లు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ముందుగా వ్యాక్సిన్‌ వేస్తారని అధికారులు చెప్పారు.   ఒక్కొక్కరికి రెండు పర్యాయాలు వ్యాక్సిన్‌ వేసే అవకాశం ఉందనీ, వ్యాక్సిన్‌ వేసిన అనంతరం అరగంట సేపు వైద్య శాఖాధికారులు అబ్జర్వ్‌ చేస్తారు. అనంతరం ఇంటికి పంపుతారని ఇమ్యూనైజేషన్‌ అధికారి డా.చర్మిష్ట తెలిపారు. ఈ ప్రక్రియకు ఐదు బృందాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ముందుగా విజయవాడలో మాక్‌డ్రిల్‌ పూర్తయిన తరువాత వ్యాక్సిన్‌ వేసే వారికి శిక్షణ ఇస్తారని తెలిపారు.


Updated Date - 2020-12-28T06:24:00+05:30 IST