ప్రభుత్వం మారితే.. రాజధాని మారుస్తారా?

ABN , First Publish Date - 2020-11-11T10:05:18+05:30 IST

ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా? అంటూ రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా

ప్రభుత్వం మారితే.. రాజధాని మారుస్తారా?

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, నవంబరు 10 : ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా? అంటూ రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం మంగళవారం 329వ రోజుకు చేరుకుంది. పెదపరిమి, ఐనవోలు, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, వెలగపూడి, నేలపాడు, బేతపూడి, పెనుమాక, నీరుకొండ, యర్రబాలెం, మందడం, తుళ్లూరు, దొండపాడు గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. టీడీపీ అధికార ప్రతినిధి, నటి దివ్యవాణి, ప్రొఫెసర్‌ కొలకపూడి శ్రీనివాస్‌రావు మందడం శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దివ్యవాణి మాట్లాడుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా కొన సాగించే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-11-11T10:05:18+05:30 IST