వైభవంగా షష్ఠి కల్యాణోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-20T06:05:16+05:30 IST
వైభవంగా షష్ఠి కల్యాణోత్సవాలు ప్రారంభం

మోపిదేవి, డిసెంబరు 19: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి జి.వి.డిఎన్.లీలాకుమార్ జ్యోతి ప్రజ్వలన, ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. దేవదాయశాఖ, అనువంశిక ధర్మకర్తలైన చల్లపల్లి రాజా వంశీయుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను ఈవో, అర్చకులు అందించారు. యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణ, అంకురారోహణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామిని పెండ్లి కుమారుడిని చేసే కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్‌కుమార శర్మ, కొమ్మూరి ఫణికుమార్ శర్మ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.