న్యాయమడిగితే కేసులా?
ABN , First Publish Date - 2020-04-25T09:38:56+05:30 IST
తమతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయం చేయ మని అడిగితే.. మాపై కేసులు

గుంటూరు, తుళ్లూరు, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): తమతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయం చేయ మని అడిగితే.. మాపై కేసులు పెడ తారా అంటూ అమరావతి ప్రాంత రైతులు, కూలీలు, మహిళలు ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాలనంతా అమరావతి నుంచే సాగాలని ఆప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్ర వారం 129వ రోజుకు చేరాయి. అంబే ద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిం చేందుకు వెళ్లిన దళిత జేఏసీ నేతలు కూడా ఇదే విధంగా ఆరోపిస్తున్నారు. తుళ్లూరుకు చెందిన మేరిగ మరియ దాసు అంబేద్కర్ చిత్రపటంతో తన నివాసంలో దీక్ష చేపట్టారు.
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాని డిమాండ్ చేస్తూ రాజధాని పెదపరిమి, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, వెలగపూడి, రాయపూడి, మంద డం, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నీరుకొండ గ్రామాల రైతులు, మహిళలు తమ నివాసాలోనే వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. మద్దతుగా పొన్నెకల్లులో వరుసగా శుక్రవారం 6వ రోజు నిరసన దీక్షలు చేప ట్టారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా అమరావతి అన్ని గ్రామాల్లో రాత్రి 7.30గంటల నుంచి 5నిమిషాలు విద్యుత్ లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి రైతులు, మహిళలు తమ నిరసన తెలియజేశారు.